Monday, November 29, 2010

మిని ప్రస్థానం

---------------

కండ బలిసిన .. బుద్ధి చెదిరిన
పొతులారా.. కొతులారా...
నవసమాజ కంటకులారా..

------------------------

చెయ్యి కలిపి...పువ్వు నలిపి..
వెన్ను విరచి...మాట మరచి...
పీఠం ఎక్కిన పిశాచులారా..

---------------------

మంత్రాంగం లేని యంత్రాంగం ...
కులాగ్రంగా   ఉన్న తంత్రాంగం...

----------------

వస్తాయా ..(జగన్నాథుని  రథ ) చక్రాలు..
నిలుస్తాయా... పరాక్రమాలు..

-------------

రాముడివా నువ్వు రామరాజ్యం సృష్టించడానికి ?
కృష్ణుడివా నువ్వు కురుక్షేత్రం నడింపించడానికి ?
కాదు కాదు భావి భారత పౌరుడివి బిచ్చమెత్తుకు తిరగడానికి.
నిస్సహాయ ఆశావాదివి నిట్టూర్పులతో కాలం గడపటానికి !

---------

అందుకే

పెట్టి  పుట్టని మిమ్ము  పట్టి ... బక్క చిక్కిన మిమ్ము జూచి ...
పట్టి పట్టి పెదాలు బిగ పట్టి... వట్టి మాటలు కట్టిపెట్టి ...
కత్తి పట్టక చేతకాని కలం పట్టి..

రాస్తున్నా ఈ కవిత...

--
వ్యాసవిరచితం..


No comments: