Thursday, January 20, 2011

పాట వదలని విక్రమార్కుడు


***********************************
పాట వదలని విక్రమార్కుడు
విక్రం కి (విక్రమార్కుడుకి )పాట కి ఉన్న అవినాభావ సంబంధం...
***************************************

ఒక్కసారి వెనక్కి వెళితే...గుండ్రాళ్ళు తిప్పుతున్నా...(తిరగకపోతే మీరే తిప్పుకోండి..).

అది 1995 వ సంవత్సరం; అవి విక్రం 5 వ తరగతి చదువుతున్న రోజులు... ఇంటి పక్కన వాళ్ళు అందరూ సంగీతం నేర్చుకోడానికి వెళ్తున్నారు..

ఎదో గత జన్మ స్మ్రుతులు  కొన్ని గుర్తుకు వచ్చాయి..ఎదో  రాగం..కర్మ కాలి పిలిచింది..

వెంటనే  విక్రం కి సంగీతం నేర్చుకోవాలి అనిపించింది..

కాని సంగీతం గురించి ఎమీ తెలీదు...ఇంట్లో సినెమాలు చూడనిచ్చేవారు కాదు...  

పాటలు రావాయె.. కాని ధైర్యం చెసి వెళ్ళాడు... ధైర్యే సంగీతోపాసనే లక్ష్మి.. అనుకున్నాడు..

ఇక చూడండీ..కట్ చేస్తే

మాస్టారు  : బాబు ఒక పాట పాడమ్మ..
విక్రం:    పాటలు రావండి..

మాస్టారు : అలా కాదు ఎదైనా ఒక పాట పాడు..
విక్రం:     నిజం గా పాటలు రావండి...

మాస్టారు  : నీ గాత్రం చూడాలి.. ఒక పాట పాడు..
విక్రం :  నాకు జన గణ మణ మాత్రం వచ్చు సర్

మాస్టారు : సరె అదే పాడు..
 అంతె; విక్రం చెలరేగి పోయాడు..

జన గణ మణ అధినాయక  . . . . జయహే జయహే.....జయ జయ జయ జయహే...

మాస్టారు  ఖంగు తిన్నారు...
ఆయన గుండె గుండ్రాయి అయ్యింది ..
ఆయనికి  కర్ణాంధకారం వచ్చింది.....

నీళ్ళ లొనుండి బైట పడిన చేప పిల్లలా గిల గిల కొట్టుకొని.. ఎలా తప్పించుకోవాలో తెలీక ఒక మాట అన్నారు..

ఓరేయి, నాకు ఒక ఆరు నెలలు ఆగి కనపడు..ఈ లోపు మళ్ళి ఈ చుట్టుపక్కల కనపడకు...


 అది విక్రం కి పాట వల్ల కలిగిన మొదటి మానసిక దిగ్భ్రాంతి  ....

*************************************************

కాల చక్రం పక్షం మాసాలు  తిరిగింది.. విక్రం..పట్టు వదలలేదు...

దానికి తొడు ఇంత్లో  Tape-recorder   వచ్చింది..ఆ వెంటనే ప్రేమదేశం పాటల క్యాసెట్ వచ్చింది..

ఈ సారి నేరుగా ప్రజల వద్దకు పాటని తీసుకెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు ....

అంతే , పాటల పోటి ఒకటి జరుగుతోంది అని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు..

తనని తాను వెనక రెండు దెబ్బలు వేసుకొని (మాహ మాహ లాగా) ప్రొత్సహించుకున్నాడు......

వెళ్ళి పేరు నమోదు చెయించాడు..క్రమ సంఖ్య  - 106 వచ్చింది...

కాసెపటికి...ముందు సంఖ్య చదివారు..ఆ తర్వాత పిలుపు వచ్చింది... విక్రం..విక్రం....

వేదిక మీదకు వెళ్తూ  ఎమి పాడలొ నిర్ణయించుకున్నాడు..

అవి ప్రేమదేశం  సినెమా విడుదల అయ్యిన రోజులు....

విక్రం గాడికి....కాలేజి  స్టయలే   అనే పాట పాడలనిపించింది...

ఇంతలొ..ఎవరొ మైక్  ఇచ్చారు...

ఇక చూడండి... విక్రం ఎప్పటి లాగానే చెలరేగి పొయాడు...

అంతే ....

తాళం పాతళానికి పరుగు తీసింది.....
రాగం గగనానికి ఎగిసి పొయింది.....
శ్రుతి సిగ్గుతో మొగ్గలేసింది......

అతనికి మైక్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది... ఇక   మైక్  అందుకొని....

"క క్క  క్క కక్క్క  క క కా ... కాలేజి  స్టయలే ..ఈ ..యీ ఆ ఊ ఏ ఏ ....." అని..

తన్మయత్వం తో  పాడుతూ ఉండగా ....

"ఎవరొ గణ గణ మని గణ్ట కొట్టారు..."

" మరుక్షణం    ఎవరో వచ్చి  మెరుపు వేగం తో మైక్ లాక్కున్నారు...."

విక్రం కి ఏమి జరుగుతోందో  తెలిసే లొపలే ఒక న్యాయ  నిర్ణేత  విషణ్ణ వదనంతో కనిపించాడు..

ఇంకో న్యాయ  నిర్ణేత ఇక చాలించు అన్నట్టు సైగ చేసాడు...

సభికులు అందరూ ఖంగు తిన్నారు ...
అందరూ నెత్తిన నిప్పుల వాన కురిసినట్టు హావ భావాలు ప్రదర్శించారు...

అప్పుడు అర్థం అయ్యింది విక్రం కి "వాళ్ళు అందరూ తనకి నత్తి అనుకున్నారని....తను పాడటానికి అమితమైన కష్టం పదుతున్నానని...... తన మీద జాలి చూపిస్తున్నారని..."

 ఇది విక్రం కి పాట వల్ల కలిగిన రెండవ దిగ్భ్రాంతి  ...

***************************************************

కాల చక్రం మరో పక్షం మాసాలు గడచింది...

కేబుల్ టి.వి. వచ్చింది... కొన్ని పాత పాటలు కొత్తగా చెవిన పడ్డాయి..

విక్రం పాట ని వదల లేదు.. అవకాశం కోసం.. Recession time  లో Hike కోసం Software Engineer వేచి చూసినట్టు వేచి చూసాడు..

ఇంతలో ఆ అవకాశం రానే వచ్చింది...

కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అంటే అదే కాబోలు...

ఒకానొక ఆదివారం...రోడ్ మీద నడుస్తూ ఉండగా..  మధు కలిసాడు..

"విక్రం అక్కడ అంత్యాక్షరి పొటీలు జరుగుతున్నాయట.." అని చెప్పాడు...

అంతె విక్రం బుర్ర పాదరసం++ లాగా  పనిచేసింది..

విక్రం:  " ఎంత మంది కావాలి టీం కి..."
మధు:  "ముగ్గురు..."
విక్రం:  "ఇతె పద వెళ్దాం.."
మధు:  "నాకు పాటలు రావు.."
విక్రం:  " అవన్ని నాకు వదిలిపెట్టు..."
మధు: "సరె, మరి మూడోవాడు..??"
విక్రం: "ఎవడొ ఒకడిని తీసుకుందాం"

కొంచెం దూరం వెళ్ళగానె సూరి కలిసాడు...
విక్రం:  "ఒరై, నీకు పాటలు వచ్చా..."
సూరి:  " పాత పాటలు ఇతె వచ్చు...."
విక్రం గాడికి సూరి గాడి "కళ్ళళ్ళో ఆనందం .. మెరుపు కనపడ్డాయి..."

అలా రహదారి మీద బ్రుంద నిర్మాణం (Team formation) చేసుకొని... కదన రంగంలో  కాలు మొపాడు విక్రం...

దగ్గర దగ్గర 50 బ్రుందాలు వచ్చాయి..పాడటానికి...
మన ప్రతిభ చూపడానికి ఈ మాత్రం అన్నా ఉండాలి అనుకున్నాడు విక్రం..

మొదటి రౌండ్ మొదలయ్యింది.. Elimination  ..ఒక మైక్ అందరి దగ్గారా తిరుగుతోంది..
దాని పాపం పండి విక్రం దగ్గరకి వచ్చింది...

"డ" మీద సింగాలి... .. విక్రం ఇక మొదలెట్టాడు..

"డీరి డిరి డిరి డీరిడి..డీరి డిరి డిరి డీరిడి..".... అంతే అన్నాడు..

న్యాయ నిర్ణేత  : ఇంకొంచెం పాడు...
విక్రం : "గొంతు సరి చేసుకొని" మళ్ళి "డీరి డిరి డిరి డీరిడి..డీరి డిరి డిరి డీరిడి.." అన్నాడు..
న్యాయ నిర్ణేత  : ఇంకొంచెం పాడాలి బాబు...

విక్రం : ఒరేయి సూరిగా నీకు పాత పాటలు వచ్చుగా... నువ్వె పాడు ఈ సారికి..అని మైక్ వాడి నొట్లో పెట్టాడు...
సూరి : నాకు ఈ పాట రాదుగా...
విక్రం : అదే వస్తుంది పాడు...
సూరి :  నాకు రాదు..
విక్రం : అలా అంటే కుదరదు...

 అందరికి నరాలు తెగె ఉత్కంఠ..
 పాపం మైక్ పట్టుకున్నవాడి జుట్టు...వర్షం లో తడిసిన కాకి జుట్టులా తయారయ్యింది...

 ఇంతలో న్యాయ నిర్ణేత అక్కడి వారికి న్యాయం చేయడానికి...ఒక ఆకస్మిక తీర్పు వెలువరించాడు...

"బాబుల్లరా...మీరందరూ  మీ మీ కుర్చీలు.. మీరె తీసుకెళ్ళి..వీక్షకుల్లొ కి వెళ్ళి వేసుకోండి..."
వెంటనె...ప్రజలందరికి "ఒళ్ళు గగుర్పొడిచేంత  ఆనందం ... మనసు పులకరించే అంత  సంతోషం కలిగాయి"
అందరూ చప్పట్లు కొట్టారు...

సూరి గాడి కళ్ళల్లో ఆనందం ఆవిరి అయ్యింది...
మధు గాడు మొద్దు బారిపోయాడు....
విక్రం గాడి చక్రం గాడి తప్పింది..
...........

ఇది విక్రం కి పాట వల్ల కలిగిన మూడవ దిగ్భ్రాంతి  ...

***************************************************

ఈ రకంగా అన్ని ఫార్మాట్లలో ఘోర వైఫల్యం  చెందిన విక్రం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని..మళ్ళి 2011 లో  పాడటానికి..సిద్దం అవుతున్నాడు...
ఇది తెలుసుకొని అతని (దుర-)అభిమానులు అందరూ వాళ్ళ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ...అవి చాలక వాళ్ళ పక్కింటి వాళ్ళ ఆస్తులు కూడా అమ్మి డబ్బు పోగు చేసి... దండయాత్రకు సిద్దం అవుతున్నారు....


***************************************************

"పాట వదలని విక్రమార్కుడు" ఇది "గార్దభ గాత్ర పీడితోద్దరణ సామ్రాట్లకు" అంకితం .....

--
మీ
వ్యాస విరచితం