Monday, November 29, 2010

మిని ప్రస్థానం

---------------

కండ బలిసిన .. బుద్ధి చెదిరిన
పొతులారా.. కొతులారా...
నవసమాజ కంటకులారా..

------------------------

చెయ్యి కలిపి...పువ్వు నలిపి..
వెన్ను విరచి...మాట మరచి...
పీఠం ఎక్కిన పిశాచులారా..

---------------------

మంత్రాంగం లేని యంత్రాంగం ...
కులాగ్రంగా   ఉన్న తంత్రాంగం...

----------------

వస్తాయా ..(జగన్నాథుని  రథ ) చక్రాలు..
నిలుస్తాయా... పరాక్రమాలు..

-------------

రాముడివా నువ్వు రామరాజ్యం సృష్టించడానికి ?
కృష్ణుడివా నువ్వు కురుక్షేత్రం నడింపించడానికి ?
కాదు కాదు భావి భారత పౌరుడివి బిచ్చమెత్తుకు తిరగడానికి.
నిస్సహాయ ఆశావాదివి నిట్టూర్పులతో కాలం గడపటానికి !

---------

అందుకే

పెట్టి  పుట్టని మిమ్ము  పట్టి ... బక్క చిక్కిన మిమ్ము జూచి ...
పట్టి పట్టి పెదాలు బిగ పట్టి... వట్టి మాటలు కట్టిపెట్టి ...
కత్తి పట్టక చేతకాని కలం పట్టి..

రాస్తున్నా ఈ కవిత...

--
వ్యాసవిరచితం..


ఉత్తుత్తి కవితలు ........


----------------------------------------------

అనగనగా ఒక పువ్వు
దానిని చూడగానే వస్తుంది మన పెదాలపై నవ్వు
అప్పుడప్పుడు అది పుట్టిస్తుంది లవ్వు
అప్పుడు దానితో అలంకరిచుకో నీ చెవ్వు
అబ్బో అబ్బో నా కవిత చాలా కెవ్వు
ఈ కవిత నచ్చని వాళ్ళకి వళ్ళంతా కొవ్వు

-------------------------

అనగనగా ఒక బగ్గు
దానిని క్రియేట్ చెసిన వాడికి లేదు సిగ్గు
తేల్చాలి నువ్వు దాని నిగ్గు
తేల్చలేకపోతే ఇంటికి వెళ్ళి కప్పుకో రగ్గు
ఇది చదవగానే అయ్యిఉంటుంది మీ వళ్ళు భగ్గు
నాకు తెల్సు ఇప్పుడు మీరు అంటారు "నువ్వు కాస్త తగ్గు"

---------------------------------------------


 బీడి తాగువానికి బుద్ధి లేదు
సిగరెట్ తాగువానికి సిగ్గు లేదు
మందు తాగువాడు మంద బుద్ధియే కదా!
ఒక మంచి మాట మన అందరి నోట

-------------------------------


తొందరగా ప్రాజెక్ట్ అవ్వాలని ........


నువ్వు వచ్చిన దగ్గరనుండి నా నిద్ర అంతా నలత
రాయలేను నీ మీద కవిత
కాని దాచలేను నీ మీద నా మమత
ఎమిటో నాకే అర్థం కాని నా ఈ వెత
తొందరగా నిష్క్రమించవా ఓ దేవతా!
...


మది లేని చెలి
మతి తప్పించే కోమలి
మండే జాబిలి
పొంగే కడలి
అలుపెరగని సుడిగాలి
గతిలేని వడగాలి
........ 

కనుమరుగైన ఒకానొక సుందర వర్ణం
చెదిరిపోయిన మధుర స్వప్నం
కదిలిపోయిన అమూల్య కాలం
శ్రుతి తప్పిన జీవన తాళం
............